గువాహటిలో హోమ్స్టేలో యువతి అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు

రిపోర్టర్: సునీల్ స్థలం: Guwahati

గౌహతి విశ్వవిద్యాలయ విద్యార్థిని నిమిషా ఠాకురియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తనపై దాడి జరిగినట్లు అర్థరాత్రి తల్లికి ఫోన్ చేసి తెలిపిన నిమిషా, ఆ తర్వాత గొంతు నులిమి లేదా ఉరివేసి చంపబడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి దీప్ ఠాకురియా ఫిర్యాదు మేరకు ఆశిక్ అలీ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.