గుంటూరులో దేశంలోనే తొలిసారిగా 3డీ సాంకేతికతతో ఆధునిక గృహాల నిర్మాణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుంటూరు
దేశంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఇరవై నుంచి ముప్పై శాతం వ్యయం తక్కువగా ఉంటుందని, భూకంపాలను తట్టుకునేలా తొంబై ఏళ్ల మన్నికతో కేవలం మూడు నెలల్లో నూరు ఇళ్లు పూర్తి చేయవచ్చని సీబీఆర్ఐ శాస్త్రవేత్తలు వివరించారు.