ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనని భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిస్కంలను తీవ్రంగా భ్రష్టు పట్టించారని, విద్యుత్ సంస్థల్లో ఏకంగా 81 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారని బిఆర్ఎస్ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.