మహిళల భద్రతపై విశాఖ పోలీసుల అవగాహన: కంచరపాలెం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై విశాఖ నగర పోలీసులు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శక్తి యాప్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, డ్రగ్స్ దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.