నిమ్స్ వైద్యాధికారి నోరి లక్ష్మీభాస్కర్ పై ఏసీబీ అక్రమాస్తుల కేసు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
తెలంగాణలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదనపు వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ పై ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా రూ.6.13 కోట్ల అధికారిక విలువ గల ఆస్తులు వెలుగుచూశాయి. అయితే మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.