తెలంగాణ భాషకు జీవం పోసిన ప్రజాకవి కాళోజి సేవలు చిరస్మరణీయం.. ఘనంగా భాషా దినోత్సవం!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ పాల్గొని కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి పరిరక్షణకు కాళోజి చేసిన విశేష కృషిని కొనియాడుతూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో కౌన్సిలర్లు కోసనం రాకేష్‌రెడ్డి, పాక చిరంజీవి, కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు.