వైద్య సేవ ట్రస్ట్ నిధులు విడుదల: ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.185 కోట్ల చెల్లింపు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు మొత్తం రూ.185 కోట్ల బిల్లులు చెల్లించినట్లు ట్రస్ట్ సీఈవో వెల్లడించారు. ఈహెచ్ఎస్ అనుబంధ ఆసుపత్రులకు రూ.50 కోట్లు, వైద్యసేవ ఆసుపత్రులకు రూ.122.64 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ నెలలో ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ.329 కోట్ల మేర చెల్లింపులు జరిగామని సీఈవో స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా విధించడంతో పాటు విధులకు గైర్హాజరైన 70 మంది వైద్యులపై వేటు వేశారు.