పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పూర్తి హక్కులతో పట్టాల పంపిణీ

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు పూర్తి హక్కులతో పట్టాలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పదకొండు మండలాల పరిధిలోని వనిమిది వేల కుటుంబాలకు పైగా విలువైన స్థలాల్ని క్రమబద్ధీకరిస్తున్నామని ఆయన తెలిపారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విశాఖపట్నంలో పేదలకు ఆస్తి భద్రత కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు.