కిర్నాపూర్ పోలీస్ స్టేషన్‌పై జనసమూహం దాడి, తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: మహేష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించిన గుంపుపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, 30కి పైగా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. గర్భిణీపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌పై రాళ్ల దాడికి దిగడంతో ఎస్డీఓపీతో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.