కుప్పంలో హంద్రీ నీవా కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కుప్పం
కుప్పం ప్రాంతంలో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణా జలాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి సమర్పించారు. కెనాల్ వద్ద పసుపు కుంకుమలు, పుష్పాలు సమర్పించి సీఎం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెనాల్ ఇరువైపులా పెద్దఎత్తున నిలబడిన రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.