సెప్టెంబర్ 9 వ తేదీ చీకటి రోజుగా నిలిచిపోతుందంటూ మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఉదయగిరి

ఉదయగిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు అరెస్టు దినంపై మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో నిర్బంధించిందని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ మండిపడ్డారు. సెప్టెంబర్ 9వ తేదీ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని, ఆ అక్రమ అరెస్టుతోనే జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు కేవలం 11 సీట్లతో తగిన గుణపాఠం చెప్పారన్నారు. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామన్నారు.