ఇచ్ఛాపురం మున్సిపల్ పోరులో దూసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం పురపాలక సంఘం ఎన్నికల్లో వివిధ వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన మూడు, వైకాపా మూడు స్థానాల్లో విజయం సాధించగా, ఒక వార్డు లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.