కాసిపేట గురుకులంలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం.. ప్రజాకవి కాళోజీకి నివాళులు అర్పించిన వైనം
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర పాఠశాల, కళాశాలలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన తెలుగు ప్రదర్శనమేలను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు జి.దివ్య, జి.శైలజ, సి.హెచ్.రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.