కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు: ఎనిమిదో వేతన సంఘంపై కీలక ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎనిమిదో వేతన సంఘం అమలు ప్రక్రియపై కీలక సమాచారం వెలువడినట్లు అధికారులు వెల్లడించారు. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ కు వివిధ ఉద్యోగ సంఘాలు తమ నివేదికలను సమర్పించాయి. ఈ వేతన సవరణ ద్వారా కనీస వేతనం భారీగా పెరిగే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు నలభై ఎనిమిది లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశలు వ్యక్తం చేస్తున్నారు.