షార్జాలో ఉడుపి వ్యక్తి దారుణ హత్య మృతదేహం తొమ్మిది ముక్కలు

రిపోర్టర్: శివ స్థలం: Udupi

కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ యూఏఈలోని షార్జాలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఆయన జులైలో హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒమన్ మార్గంలో పార్క్ చేసిన కారులో ఆయన మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి రెండు బ్యాగుల్లో ఉంచినట్లు సోదరుడు అనిల్ ప్రశాంత్ వెల్లడించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు ఉడుపి ఎస్పీని కలిసి సహాయం కోరారు.