యూపీలో ఎన్నికల శంఖారావం: పద్దెనిమిది డివిజన్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
రిపోర్టర్: రాము
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్ లో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని పద్దెనిమిది పరిపాలనా డివిజన్లలో విస్తృత స్థాయి బహిరంగ సభలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారని, యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారని తెలిపారు.