రోడ్లు లేక డోలీ మోతలతో రోదిస్తున్న అడవితల్లి ఆక్రోశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: మేడ్చల్

మేడ్చల్ చెక్‌పోస్ట్ నుంచి అలియాబాద్ చౌరస్తా వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైంది. రోడ్డంతా భారీ గుంతలతో కంకర తేలి చెరువులను తలపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు, స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించబోయి కిందపడి నిత్యం గాయాలపాలవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.