హైదరాబాద్లో దారుణం: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన వాచ్మన్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని కౌకూర్ విల్లాస్ వద్ద ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రధాన నిందితుడు విక్రమ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ వాచ్మన్ విక్రమ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేశాడని, ఈ ఘటనపై మల్కాజిగిరి సీపీ సుమతి ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.