యుత నిరసనకారుల అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం: ఢిల్లీ పోలీసులకు కఠిన ఆదేశాలు

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులను విచక్షణారహితంగా అరెస్టు చేయరాదని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయ నిపుణులు తెలిపారు. నిరసనల సందర్భంగా అణచివేత చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రాంగణం వద్ద ఉన్న సెక్షన్ 163 బోర్డులను తొలగించాలని, మెట్రో లేదా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించరాదని ధర్మాసనం స్పష్టం చేసినట్లు పిటిషనర్లు వెల్లడించారు.