నాగాపూర్లో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

పెంబి మండలం నాగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధన, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.