విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ: ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: Eluru
నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించేందుకు ఐబీఎం క్విస్కిట్ ఫాల్ ఫెస్ట్-2026 ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. నూజివీడులోని ఆర్జీయూకేటీలో సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.