కలెక్టర్ల సమావేశానికి గైర్హాజరైన హెచ్‌వోడీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సమావేశానికి గైర్హాజరైన హెచ్‌వోడీలపై మండిపడ్డారు. ఎంత ధైర్యం ఉంటే సమావేశానికి రారంటూ వారందరి నుంచి సంజాయిషీ తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. సమావేశానికి రాకపోవడం తమాషాగా ఉందా అని ప్రశ్నిస్తూ.. మీరంతా మారకుంటే తాను మరింత కఠినంగా ఉంటానని హెచ్చరించారు.