ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

దేశంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాల నిర్వహణపై వస్తున్న వార్తలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషనర్ల నియామక చట్టాన్ని పునఃసమీక్షించి, సీజేఐని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరిగిందని, వ్యవస్థల్లో పారదర్శకత లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.