ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ పై భారీ సైబర్ దాడి: రూ.52 వేల కోట్లు గల్లంతు

రిపోర్టర్: హరి స్థలం: Global

ప్రపంచంలోనే ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ పై భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 29న జరిగిన ఈ ఘటనలో హాట్ వాలెట్ల నుంచి సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో టోకెన్లు ప్రభావితమైనట్లు బినాన్స్ పేర్కొంది. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.52 వేల కోట్లకు సమానమని సంస్థ తెలిపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం భద్రతా తనిఖీల నిమిత్తం విత్డ్రాయల్స్ను తాత్కాలికంగా నిలిపివేసింది.