నోయిడాలో దారుణం: కారు బోనెట్‌పై యువకులు వేలాడుతుండగా వేగంగా దూసుకెళ్లిన డ్రైవర్
రిపోర్టర్: సురేష్
స్థలం: Noida
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన భయానక ఘటనపై అదనపు డీసీపీ అభయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సెక్టర్ పద్దెనిమిదిలో రోడ్డుపై క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతుండగా, ఇద్దరు యువకులు బోనెట్‌పై వేలాడుతూ కనిపించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఏడీసీపీ స్పష్టం చేశారు.