సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే

రిపోర్టర్: కృష్ణ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వరుసగా రెండో రోజు సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వే నంబర్ 325 పరిధిలోని 388 ఎకరాల భూములపై తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూ కుంభకోణంపై ప్రత్యేక విచారణ జరిపి, ప్రభుత్వ భూములు తేలితే స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.