హైదరాబాద్లో కిరికిరి చిత్రం ప్రారంభం: ఏఐ టెక్నాలజీతో తెరకెక్కుతున్న మూవీ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
కృత్రిమ మేధ సాంకేతికతతో తెరకెక్కుతున్న కిరికిరి చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను హైబ్రీడ్ టెక్నాలజీ విధానంలో సోషల్మూవీగా రూపొందిస్తున్నట్లు దర్శకుడు భరద్వాజ్ దాయాల వెల్లడించారు. రవికాంత్ వీరపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాతలు ప్రసాద్ దేవినేని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.