నగరిలో అభివృద్ధి పనుల జోరు: పెరమాళ్ళుగుడి వీధిలో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని పెరమాళ్ళుగుడి వీధిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను స్థానిక ఎమ్మెల్యే భాను ప్రకాష్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.