'ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టిస్తున్నారు': మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చెలరేగింది. రూ.2000లకు పైబడిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీల నిర్ణయానికి కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారన్న బీజేపీ ఆరోపణలను హస్తం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే మోదీ సర్కార్ దిగజారుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఎంపీలు గౌరవ్ గొగొయ్, మనీశ్ తివారీలు మండిపడ్డారు. పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో యూపీఐ ఛార్జీలపై ఎలాంటి చర్చ జరగలేదని, గోప్యమైన చర్చలను రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని వారు స్పష్టం చేశారు.