'విద్యార్థుల భద్రత': సైబర్ నేరాలపై VizagCityPolice అవగాహన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
విద్యార్థుల భద్రతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలపై VizagCityPolice అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు 24 సైబర్ క్రైమ్ అవెర్నెస్ షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రదర్శించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా లింక్ ల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు పోలీసు అధికారులు సూచించారు.