అసెంబ్లీ ప్రాంగణంలో గుండెపోటుతో పర్సనల్ సెక్రటరీ రాజు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఐఏఎస్ అధికారి పర్సనల్ సెక్రటరీ రాజు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఇది గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందడంతో అసెంబ్లీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.