హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు: డైట్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించారు. తరగతుల వారీగా డైట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం, కొత్త మెనూ ప్రకారం వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్తో పాటు పాలు, పండ్లు అందించనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.