ఓటరు జాబితా సవరణపై అధికారులతో బీజేపీ నేతల భేటీ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో ఎస్ఐఆర్-2 ప్రక్రియపై బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నాయకులు బీఎల్ఓ అధికారులతో సమావేశమయ్యారు. నోటీసుల స్థితి, దరఖాస్తుల పరిష్కారం, మరణించినవారి పేర్ల తొలగింపుపై చర్చించారు. అనర్హులను చేర్చవద్దని, ఓటర్లు వివరాలు సరిచూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాణిక్ రావు, బోయిని మహేష్ యాదవ్, విజేందర్, శ్రీధర్ రావు, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.