నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్ అంటూ పట్టాభి ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

బ్రాండ్లు మార్చేసి, ధరలు పెంచేసి నకిలీ మద్యంతో వైఎస్ జగన్ ప్రజల ప్రాణాలు తీశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని, కల్తీ మద్యం దందాను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా ప్రాణాలతో చెలగాటమాడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.