భారత్ వెస్టిండీస్ టీ20 సమరం: అక్టోబరు ఆరున తొలి మ్యాచ్ ప్రారంభం

రిపోర్టర్: మహేష్ స్థలం: లక్నో

భారత క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్తో ప్రతిష్టాత్మకమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మంగళవారం అక్టోబరు ఆరు నుంచి ప్రారంభం కానున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. లక్నోలోని ఎకానా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యవ భారత జట్టు సిద్ధమైంది. వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న జోష్లో ఉన్న టీమిండియా, ఈ పొట్టి సిరీస్లోనూ విజయం సాధించి ఘనంగా బోణీ కొట్టాలని ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తోంది.