నారాయణపేటలో ఎర్రమట్టి అక్రమ రవాణాపై అధికారుల నిర్లక్ష్యం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లాలో ఎర్రమట్టి అక్రమ రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. ధన్వాడలో అనుమతులు పొంది, కిష్టాపూర్ గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాల పేరుతో గుత్తేదారులు, టిప్పర్ యజమానులు అధికారుల అండతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు ఒక చోట, తరలింపు మరోచోట జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల వల్ల గుట్టలు కనుమరుగై మైదానాలుగా మారుతున్నాయి.