డమ్మీ స్కూళ్ల గుట్టురట్టు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: అజమ్గఢ్
విద్యార్థులకు తెలియకుండా డమ్మీ స్కూళ్లలో పేర్లు నమోదు చేస్తున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించిందని న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి. అజమ్గఢ్లోని ఓ పాఠశాల, కోచింగ్ అకాడమీ కార్యకలాపాలపై తనిఖీలు నిర్వహించి నవంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జస్టిస్ సిద్ధార్థ నందన్ స్పష్టం చేశారు.