యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

రిపోర్టర్: మహేష్ స్థలం: India

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరలిస్ట్, హిందీ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 28 వరకు గడువు ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.