పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో దాడి: రాష్ట్రంలో కలకలం సృష్టించిన దారుణం

రిపోర్టర్: విజయ్ స్థలం: అనంతపురం

పాఠశాల గదిలో విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం అత్యంత దారుణమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఈ ఘటనపై పలువురు మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున పూర్తి అండదండలు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పాఠశాలల్ లో భద్రత పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.