వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, వైఎస్ జగన్ వద్ద తనను దుర్మార్గుడిగా చిత్రీకరించారని ఆయన ధ్వజమెత్తారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని, వెనుకబడిన కులాలకే సీఎం పదవి ఇస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.