అమెరికా రాజకీయాల్లో కలకలం: ఒహాయో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి హవా
రిపోర్టర్: కిరణ్
స్థలం: Ohio, USA
అమెరికాలోని ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారని వివిధ సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. డెమొక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్తో హోరాహోరీ పోరు సాగుతున్న ఈ ఎన్నికల్లో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తనకు కలిసి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాల సమస్యలపై ప్రచారం నిర్వహిస్తున్నట్లు సర్వేలు వెల్లడించాయి.