జగన్పై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
వైకాపా హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో సాగించిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్.. డీఎస్సీ నియామకాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువతలో అయోమయం సృష్టించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.