వైకాపా డ్రామాలపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఎన్నికల్ లో ఓడిపోతే కుట్ర అంటూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ కొత్త డ్రామాలాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేసినప్పటికీ రీపోలింగ్ కోరడం దారుణమని పార్థసారథి స్పష్టం చేశారు.