బస్టాండ్ సమీపంలోని మద్యం షాపులను తొలగించాలంటూ సీపిఐ నిరసన
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో బస్టాండ్ సమీపంలో వెలసిన రెండు మద్యం షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపిఐ నాయకులు రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం అందజేశారు. బస్టాప్ మరియు అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఉండటం వల్ల ప్రయాణికులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపులను ఊరికి వెలుపలకు తరలించాలని సీపిఐ టౌన్ సెక్రెటరీ వాలన్, నేతలు భాషా, శ్రీనివాసులు, రాజేంద్ర కోరారు.