స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు: వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి చోటా పార్టీ అభ్యర్థులు బరిలో ఉండాలని, గతంలో పదవులు కోల్పోయిన మేయర్లు, ఛైర్మన్లకు మరోసారి అవకాశం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.