అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ భవిష్యత్తుపై నిర్ణయాధికారం బీసీసీఐకి

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

ముంబైలో జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని బోర్డు ఆఫీస్ బేరర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2023లో నియమితులైన అగార్కర్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో, ఆయనకు పొడింపు లభిస్తుందా లేక కొత్త ఛైర్మన్ నియామకం జరుగుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మాజీ వికెట్ కీపర్ పార్థ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.