రోడ్డుపై బస్సు బీభత్సం: నడకకు వెళ్లిన ఇద్దరు మహిళలు దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Bhubaneswar
భువనేశ్వర్ నయాపల్లి ప్రాంతంలో ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ప్రయాణికుల బస్సు బీభత్సం సృష్టించిందని పోలీసులు తెలిపారు. అదుపుతప్పిన బస్సు వాకింగ్ కు వెళ్లిన వారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడని, గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.