నెల్లూరులో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జిల్లా సంయుక్త కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. విజయవాడలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో పాల్గొనగా.. నెల్లూరు నుంచి అధికారులు, వైద్యులు ఈ కార్యక్రమంలో వీక్షించారు. అత్యవసర వైద్య సేవలందించడంలో ఈ బ్లాక్ ఎంతో కీలకమని అధికారులు తెలిపారు.