కన్ఫర్మ్ అయిన రైలు టికెట్ బదిలీకి ప్రత్యేక వెసులుబాటు కల్పించిన రైల్వే శాఖ
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
అత్యవసర కారణాల వల్ల ప్రయాణాలు రద్దయినప్పుడు కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోకుండానే కుటుంబ సభ్యుల పేరు మీదకు బదిలీ చేసుకునే కీలక వెసులుబాటును భారతీయ రైల్వే కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదుపాయం ద్వారా రక్త సంబంధీకులకు రైలు బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్లో దరఖాస్తు చేసుకుని పేరు మార్చుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు, వివాహ బృందాలు, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన నిబంధనలతో ఈ అవకాశం వర్తిస్తుందని పేర్కొన్నారు.