రాజాపేట మండలంలో బార్లను తలపిస్తున్న దాబాలపై చర్యలు శూన్యం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పొట్టిమర్రి గ్రామంలో కొన్ని దాబాలు నిబంధనలకు విరుద్ధంగా బార్లను తలపిస్తున్నాయంటూ స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాలమైన సిట్టింగ్ ఏర్పాట్లతో రాత్రి పన్నెండు గంటల వరకు కార్యకలాపాలు సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.